TGTET-JUNE-2025: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్

TGTET-JUNE-2025: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పూర్తి సమాచారం

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ (Department of School Education) TGTET-JUNE-2025 (తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత అనేది తెలంగాణలో I-VIII తరగతుల ఉపాధ్యాయ నియామకాలకు అర్హతగా పరిగణించబడుతుంది. ఇక్కడ మీకు అన్ని ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి:

1. TGTET-JUNE-2025 కీ ముఖ్య తేదీలు

ఈవెంట్ తేదీలు
అప్లికేషన్ ప్రారంభం 15-04-2025
అప్లికేషన్ చివరి తేదీ 30-04-2025
హాల్ టికెట్ డౌన్లోడ్ 09-06-2025 నుండి
పరీక్ష తేదీలు 15-06-2025 to 30-06-2025
ఫలితాలు 22-07-2025

2. 💻 పరీక్ష విధానం:

  • పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ (Computer Based Test) విధానంలో నిర్వహించబడుతుంది.

  • ప్రతి పేపర్‌కు 150 ప్రశ్నలు (MCQs) ఉంటాయి, మొత్తం 150 మార్కులు.

  • పేపర్-I: తరగతులు I-V కి ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు.

  • పేపర్-II: తరగతులు VI-VIII కి ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులకు.

  • రెండు పేపర్లకూ దరఖాస్తు చేసుకోవచ్చును.

3.  పరీక్ష సెషన్లు:

  • మోర్నింగ్ సెషన్: 9:00 AM to 11:30 AM
  • ఆఫ్టర్నూన్ సెషన్: 2:00 PM to 4:30 PM

 4. TGTET అర్హత (Eligibility)

పేపర్-I (తరగతులు I-V కోసం):

  • ఇంటర్మీడియట్ (కనీసం 50% మార్కులు, SC/ST/BC/PH కి 45%).
  • 2-సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా 4-సంవత్సరాల B.El.Ed ఉత్తీర్ణత.

పేపర్-II (తరగతులు VI-VIII కోసం):

  • గ్రాడ్యుయేషన్ (కనీసం 50% మార్కులు, SC/ST/BC/PH కి 45%).
  • B.Ed లేదా B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత.

నోట్: ఫైనల్ ఇయర్ B.Ed/D.El.Ed విద్యార్థులు కూడా పరీక్షకు అర్హులు.

5. ఫీజు వివరాలు:

పేపర్ ఫీజు
పేపర్-I లేదా పేపర్-II ₹750/-
రెండు పేపర్లు ₹1000/-

6. దరఖాస్తు విధానం:

  1. https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపాలి.

  2. ఫోటో (500kb) & సంతకం (100kb) స్కాన్ కాపీలు కావాలి.

  3. పేమెంట్ చేసిన తర్వాత లభించే Journal Number తో అప్లికేషన్‌ను పూర్తిగా సమర్పించాలి. 7.క్వాలిఫైయింగ్ మార్క్స్

    కేటగరీ క్వాలిఫైయింగ్ మార్క్స్
    జనరల్ 60%
    BC 50%
    SC/ST/PH 40%

    TGTET సర్టిఫికేట్ వాలిడిటీ: లైఫ్ టైం.

    8.హెల్ప్ డెస్క్ & ముఖ్యమైన లింక్లు

    • హెల్ప్ నంబర్లు:
      • డొమైన్ సమస్యలు: 7093958881 / 7093468882
      • టెక్నికల్ సమస్యలు: 7032901383 / 9000756178
    • అధికారిక వెబ్సైట్: https://schooledu.telangana.gov.in

    సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి: పై వెబ్సైట్ నుండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top